తెలుగు దేశంలో తెల్లవారి ఎవరి ఇంటిముందు చూసినా, చక్కగా పెట్టిన ముగ్గులు కనిపిస్తాయి. ముగ్గులు పెట్టడం చేతరాని ఆడ వాళ్లు తెలుగు దేశంలో దాదాపుగా లేరు.
ముగ్గులు పెట్టడం గొప్ప నేర్పు. ఆ పని సునాయాసంగా చేసేస్తారు తెలుగు ఆడ పిల్లలు.
ముగ్గు పెట్టేందుకు సున్నపు పొడి వాడతారు. (అది కూడా ముగ్గే అంటారు.) ఆ సున్నపు పొడి వాళ్ల సున్నితమైన వేళ్ళమధ్య ఎన్ని వొంకర్లు తిరగమంటే అన్ని వొంకర్లూ తిరుగుతుంది. తెల్లవారు జామునే ఇంటిముందు నేలంతా తుడిచి, కళ్లాపి జల్లి, తడి ఇంకా అలా వుండగానే రకరకాల ముగ్గులు పెడితే, ఇల్లు చూడ చక్కగా వుంటుంది.
ఇంటిముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఎవరూ కాపరం ఉండడం లేదనో ఎవరో పోవడం లాంటిది జరిగి, మైల లాంటిది ఏదో వుందనో అర్థం ట. అందుకని నాలుగు రోజుల పాటు ఇల్లు విడిచి వెళ్లే వాళ్లు పక్కింటి వాళ్లని తమ ఇంటిముందు కాస్త ముగ్గు పెడుతూండమని చెప్పి మరీ వెళ్తారు. పొద్దున్న ఇంటిముందు ముగ్గు వెయ్యకుండా పాచి గుమ్మం దాటి మొగవాళ్లు వెళ్లడం తప్పుట. అందుకని మరీ పొద్దున్నే మొగాళ్లు బయటికెళ్లాలిసొస్తే, ఇంటి ఆడ వాళ్లు ముందు గుమ్మం దగ్గిర రెండు ముగ్గు కర్రలు వేసి వస్తారు.
సంక్రాంతి ముఖ్యంగా ముగ్గుల పండగ అనొచ్చు. సంక్రాంతి ఇంకా నెల్లాళ్లు వుందనగా మొదలవుతుంది - ముగ్గులు పెట్టడం. సంక్రాంతి ముగ్గులు సాయంత్రం కూడా పెడతారు. ముగ్గులు ఇంటిముందే కాదు, ఇంట్లో కూడా పెడతారు. గచ్చు చేసిన నేల అయితే ముగ్గులు పెట్టడం కష్టం. దానిమీద ముగ్గు పిండితో పెట్టిన ముగ్గులు అత్తవు. అందుకని సుద్ద నీళ్లలో నానవేసి దాంతో ముగ్గు పెడతారు. ఈ ముగ్గులు ఒక సారి పెడితే కొన్ని రోజులవరకూ పోకుండా వుంటాయి.
ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా ముందు నేల అలికి, ముగ్గు వేసి, తరవాత దేవుడి విగ్రహం ఆ ముగ్గుమీద పెడతారు.
ఇంగ్లీషు చదువులూ, అలవాట్లూ వచ్చాక, ముగ్గులు మోటయి మానేస్తున్నారు కొందరు. కొత్త తరహా ఇళ్లకి గుమ్మంలో ముగ్గు నప్పదని మానేస్తున్నారు కొందరు. ఇంగ్లీషు చదువులు చదువుకున్న అమ్మాయిలకి కొందరికి ముగ్గులు పెట్టడం రాదు కూడా.
కాలంతో అలవాట్లు మారక తప్పదు. ముగ్గులు పెట్టే అలవాటు ఈ మారుతున్న కాలంలో ఎంత కాలం వుంటుందో చెప్పలేం. కాని, ముగ్గులు చూడ్డానికి బాగుంటాయని మాత్రం చెప్పగలం.
తెల్లవారి | “after daybreak” from తెల్లవారు v. “to dawn.” In a few instances, the nonfinite form of the verb is used to indicate time. See the following examples: ఆయన ఎండెక్కి బయలుదేరారు. He started after the sun grew hot. ఎండ “sun”, ఎక్కు verbaliser, “grow, rise high” మీరు మరీ పొద్దెక్కి రాకండి. Do not come after it is late in the morning. పొద్దు “sun” ఆయన చీకటి పడి వెళ్లారు. He left after dark. ఆయన తెల్లవారి కనిపించలేదు. He is not seen after the morning. In the above examples, the verbs are ఎక్కు, పడు, పారు serving as verbalisers of ఎండ “sun”, పొద్దు “sun”, తెల్ల “whiteness”; making composite verbs ఎండెక్కు, పొద్దెక్కు, తెల్లవారు (తెల్ల + పారు an old Telugu sandhi which is not operative in modern Telugu, retained only in this verb.) |
చక్కగా | adv. “neatly, beautifully” |
పెట్టిన | verbal adj. of పెట్టు “to put, place” |
ముగ్గులు | “designs made with white lime powder” |
కనిపిస్తాయి | “to appear, be seen” from v. కనిపించు |
ముగ్గులు పెట్టడం | “making ముగ్గులు” |
చేత వచ్ఛు | “to know a skill” used with a person in the dative and and the skill in the nominative. |
చేతరాని ఆడ వాళ్లు | “women who do not know (the skill of)” |
దాదాపుగా | “almost, nearly” |
లేరు | “do not exist” negative of ఉండు |
గొప్ప నేర్పు | “a great skill” గొప్ప “great” నేర్పు “skill” |
సునాయాసంగా | “easily, with no effort” |
చేసేస్తారు | from చేయు. Note the use of the emphatic. |
ముగ్గులు పెట్టేందుకు | “for making ముగ్గులు.” పెట్టే + అందుకు verbal adj. + అందుకు is a very productive construction to indicate purpose or reason.
మేం తెలుగు చదువుకునేందుకు విశాఖపట్నం వచ్చాం. We came to Vishakhapatnam for studying Telugu. మీరు నాతో తెలుగులో మాట్లాడినందుకు సంతోషం. I am glad (because) you talked to me in Telugu. They put him in prison because of theft. దొంగతనం చేసినందుకు వాణ్ణి ఖైదులో పెట్టారు. మీరు రానందుకు ఆయన చాలా విచారించారు He regretted you did not come. ఆయన సైకిలు బాగు చేయించినందుకు పది రూపాయిలు అయింది. It cost (him) ten rupees to get his bicycle fixed. |
సున్నపు పొడి | “lime, calcium carbonate powder” |
వాడతారు | from వాడు v. “to use” |
అది | object of v. అంటారు
దాన్ని (accusative) is not used because ముగ్గు is inanimate. |
అంటారు | “(people) call” |
సున్నితమైన | adj. “delicate” |
వేళ్ల | oblique form of వేళ్లు “fingers” |
మధ్య | “in (the middle of), between” |
వంకర్లు | pl. of వంకర “curve” |
తిరగమంటే | తిరుగు (imperative) “turn” + అంటే conditional of v. అను “to say”
ఎన్ని వంకర్లు తిరగమంటే అన్ని “As many curves as are requested” ఎన్ని followed by a conditional verb + అన్ని “as many as” ఎన్ని పుస్తకాలు దొరికితే అన్నీ కొనండి. “Buy as many books as you find.” ఆయనకి ఎన్ని చొక్కాలు కావాలంటే అన్నే కొనండి. "Buy just as many shirts as he wants.” మీరు ఈ సినిమా ఎన్ని సార్లు చూడాలంటే అన్ని సార్లు చూడొచ్చు. “You can see this movie as many times as you want.” This construction is possible with other question words too. మీకు ఇల్లు ఎక్కడ కావాలంటే అక్కడ చూద్దాం. “We will look for an apartment in the area you prefer.” మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి. “Come whenever you have time.” |
తెల్లవారు జాము | “the period of time between first light and sunrise” -న locative suffix -ఏ definitive.
This is one of the few time words in Telugu that takes a locative suffix. రాత్రి “night”, సాయంత్రం “evening”, పగలు “day”, do not take a locative suffix.
నేను రాత్రి చదువుతాను. “I read during the night.” మీరు సాయంత్రం రండి. “Come in the evening.” ఆయన పగలు ఇంట్లో ఉండరు. “He does not stay home during the day.” However, locative -న in తెల్లవారు జామున is optional, as also in మధ్య(న) “in the middle”. But in పొద్దున్న “morning” locative -న has become part of the word. |
నేల | “floor” |
అంతా | “all (of the floor)” |
తుడిచి | from v. తుడుచు “to wipe, sweep”
మొహం తువ్వాలుతో తుడుచుకున్నాను. “I wiped my face with a towel.” నేల చీపురుతో తుడిచాను. “I swept the floor with a broom.” కళ్లు తుడుచుకో; ఏడవకు. “Wipe your eyes; don’t cry.” మొన్నటి గాలివానకి వూరంతా తుడిచి పెట్టుకుపోయింది. “The last cyclone has destroyed the whole village.” తుడిచి పెట్టుకుపోవు “to be wiped out, annihilated” |
కళ్లాపి | alt. కళాపి “water mixed with cow dung” |
జల్లి | from v. జల్లు “to sprinkle”. Also “to scatter, to sow (seeds)”
ఈ గుమ్మం ముందు నీళ్లు జల్లాను. “I sprinkled water in front of this doorway.” ఈ బియ్యం అంతా ఎవరు జల్లేసారు? “Who scattered all the rice here?” పొలంలో మేం ఇంకా విత్తనాలు జల్లలేదు. “We have not sown seed in our field yet.” |
తడి | “wetness”
తడి ఇంకా అలా వుండగానే “while (the floor) is still wet.” ఇంకా “yet, still” అలా “that way, as it is” ఉండగా adv. “while it lasts” + న్ glide + ఏ definitive |
రకరకాల | “of many varieties”, oblique of రకరకాలు |
చూడ చక్కగా వుంటుంది | “will be beautiful to look at”
చూడ infinitive of v. చూచు “to look at” An interesting use of the infinitive as an adverb. చూడ చక్కగా వుండు is a very popular verb phrase, though there are not many of this kind in use in modern standard Telugu. |
కాపరం | “residence; act of residing in a house”
ఉండు verbaliser కాపరం ఉండు “to reside” |
అనో | అని + ఓ. ఓ (followed by another ఓ in a sentence), “either, or” |
ఎవరో | ఎవరు + ఓ “someone unknown” |
చచ్చిపోతే | “when died”. From చచ్చిపోవు “to die” |
మైల | “pollution related to death in a family.” The family is considered impure for eleven days after the death of a person in the family. The period varies depending on the closeness of the kinship with the deceased person and also with the caste traditions. |
మైల లాంటిది ఏదో | “something like మైల” An elaborate way to indicate hesitation to name the polution. - లాంటిది “(some) thing like” |
ఉంది | “there is” |
అనో | అని + ఓ (ఓ for “either, or”) |
అర్థం | “meaning” |
-ట | “so they say”, diminutive of అట, added to indicate uncertainty of source, non-verifiability of fact, or simply a reported statement. |
అందుకని | “therefore” అందుకు + అని |
నాలుగు రోజుల పాటు | “for a few days”
నాలుగు / పది can indicate a ‘few’ or ‘many’, rather than the precise numbers four and ten. పది మంది ఏం అంటే, ఆయనా అదే అంటారు. “He says what the majority says.” ఆయన్ని నలుగురూ నాలుగు మాటలూ అన్నారు. “Everyone in the society blamed him.” |
పాటు | postposition of duration, follows time words of at least a day’s length. For shorter durations సేపు is used. |
ఇల్లు విడిచి వెళ్లే వాళ్లు | “those who leave the house”. విడిచి non-finite of విడుచు “to leave”. ఇల్లు “house”, acc. suffix is not used because ఇల్లు is inanimate. |
పక్కింటి వాళ్లని | acc. of పక్కింటి వాళ్లు “neighbors” పక్క + ఇల్లు > పక్కిల్లు “neighboring house” ~ఇంటి oblique of ఇల్లు. వాళ్లని acc. of వాళ్లు. |
తమ | reflexive = వాళ్ల; refers to the owners leaving the house. Used to avoid repetition of వాళ్ల and the consequent confusion as to who వాళ్ల refers to. |
కాస్త | “a little”. This word usually prefaces a favor asked:
కాస్త మంచి నీళ్లు ఇస్తారా? “Would you please give me a little water?” కాస్త అటు జరుగుతారా? “Could you please move over a bit?” కాస్త ఆ పుస్తకం ఇలా తెస్తారా? “Could you please bring me that book?” కాస్త in the examples above is an adverb giving the sense that the favor asked is a small one. |
పెడుతూండమని | పెడుతూ non-finite of పెట్టు verbaliser of ముగ్గు. పెడుతూ + ఉండు “to keep putting (ముగ్గు)”. ఉండమని < ఉండు + అని. |
చెప్పిమరీ | మరీ < మరియు adv. from old Telugu మరియు “and”. Here it emphasizes the fact that the householders make sure of ముగ్గు arrangements before they leave. When used in this meaning, మరీ is preceded by a non-finite verb.
ఆయన్ని అడిగి మరీ వచ్చాను. “I asked his permission before I came.” ఈ పుస్తకం చదివి మరీ చెప్పండి. “Read this book before you say (anything).” |
పొద్దున్న | “in the morning” పొద్దున్న “morning” with న locative |
ఇంటి ముందు | “in front of the house” |
ముగ్గు వెయ్యకుండా | “without putting ముగ్గు” |
పాచి | Things left overnight are considered unclean. Like the mouth that should be washed in the morning. The doorstep of the house and the front yard of the house should also be swept and cleaned. They are all described as పాచి “unclean”. |
గుమ్మం | “doorway; doorstep” |
దాటి | from దాటు “to cross” |
మొగవాళ్లు | “menfolk”, మొగ adj. “male” |
తప్పు | “taboo” |
-ట | Refer to the note above about reported speech. |
అందుకని | అందుకు + అని “therefore” |
మరీ పొద్దున్నే | adv. “very early”, పొద్దున్న “in the morning” + ఏ definitive; మరీ indicates a high degree. |
మొగాళ్లు | alt. మొగవాళ్లు see above. |
బయటికి | బయటి oblique form of బయట “outside” |
ఎళ్లాలిసొస్తే | ఎళ్లాలిసి (alt. వెళ్లవలసి) + ఒస్తే (వస్తే) non-finite form of వెళ్ళ వలయు.
You are familiar with obligative forms of verbs. Obligative suffix -ఆలి is derived from old Telugu v. వలయు “to need”. Its non-finite form is వలసి. inf. + వలసి + వచ్చు This is an open ended construction and can be conjugated in all the forms of వచ్చు. Using వెళ్ల as the infinitive, we can have వెళ్లవలసి వచ్చు. This compound verb could be used in all possible forms of వచ్చు. Examples: వెళ్లవలసి వచ్చింది వెళ్లవలసి వస్తుంది వెళ్లవలసి రాదు వెళ్లవలసి రాకూడదు వెళ్లవలసి వస్తే వెళ్లవలసి వచ్చిన + noun. వెళ్లవలసి వచ్చే + noun. By this device, obligation is extended to all tenses and modes. The subject of this compound verb is always an అది. That is why the verb has only ది/దు as the pronominal suffix. నేను నిన్న విజయవాడ వెళ్లవలసి వచ్చింది “I had to go to Vijayawada yesterday.” The reason, if you are interested: వలసి converts the compound, inf. + వలసి, into an abstract noun which functions as the subject of v. వచ్చు. That is why the pronominal suffix is always ది/దు . |
ఇంటి ఆడ వాళ్లు | “women folk of the house” |
ముందు | “at first” |
గుమ్మం దగ్గిర | “near the front doorway” |
రెండు ముగ్గు కర్రలు | “a couple of lines of ముగ్గు”.
రెండు does not indicate a specific number here. కర్రలు lit. “sticks” but here, “lines” |
సంక్రాంతి | a festival which comes on January 14 |
ముఖ్యంగా | adv. “primarily, chiefly” |
పండగ | “festival” |
అనొచ్చు | alt. of అనవచ్చు |
నెల్లాళ్లు | “a month; a month of days” నెల + నాళ్లు (Pl. of నాడు “day”) |
ఉందనగా | “before”, ఉంది + అనగా
సంక్రాంతి నెల్లాళ్లు ఉందనగా ముగ్గులు పెట్టడం మొదలవుతుంది. “The making of muggus starts a month before Sankranti.” v. + అనగా to mean “before” is interesting: ఇంకో రెండు నిమషాల్లో మీ బస్సు వొస్తుందనగా రైలు వెళ్లిపోయింది. “The train left two minutes before the arrival of your bus.” సెలవులు ఇంకో వారం తరవాత ఇస్తారనగా అతను క్లాసు మానేస్తాడు. “He skips classes a week before vacation.” |
పూజ | “worship of god” |
మొదట | “at first” |
నేల | “floor” |
అలికి | from v. అలుకు “to smear the floor with water, cow dung, etc. as a way of cleaning” |
తరవాత | “later” |
దేవుడి | oblique of దేవుడు “god” |
విగ్రహం | “image, idol” |
గచ్చు | cemented or plastered surface of a floor (verbaliser చేయు) |
అత్తవు | from అత్తు “to be absorbed, to sink in”,
If you put paint on wood, దానికి రంగు ఎత్తుతుంది. If you put paint on a glossy or oily surface, రంగు అత్తదు. (రంగు “color, paint”) |
సుద్ద | “limestone substance made soft and sticky” |
నీళ్లల్లో | alt. నీళ్లలో “in water” |
నానేసి | from నాన + వేసి > ఏసి, నాను v. intr. “to soak”, నాన inf., నానవేయు v. tr. “to soak”, also నానబెట్టు v. tr. “to soak” |
దాంతో | దాని + తో “with that” |
పోకుండా | “without fading” |
ఇంగ్లీషు | “English, western” |
చదువులు | “education” |
అలవాట్లు | “habits, styles of living” |
మోటు | “coarse, crude, not fashionable” |
మానేస్తున్నారు | from మానేయు emphatic of v. మాను “to stop, to cease”. Always used with -ఏయు emphatic. |
కొత్త | “new” |
తరహా | “style, type, variety” |
గుమ్మం | “doorstep” |
నప్పదు | from v. నప్పు “to suit, to fit, to match
ఆ ఎర్ర చొక్కా మీద ఈ పంట్లాం నప్పదు. “This pair of slacks does not match that red shirt.” నా కాలికి ఈ జోడు నప్పలేదు. “This shoe does not suit my feet.” |
కాలం | “time” (longer durations) |
-తోపాటు | “along with” |
మారక తప్పదు | “cannot but change, definitely will change” మారు v. intr. “to change”. Non-progressive nonfinite negative +తప్పదు is used to indicate inevitability.
ఆయన వెళ్లక తప్పదు. “He has to go.” మీరు ఇక్కడ ఉండక తప్పుతుందా? “You have to stay here. No alternative. Is there?” పుట్టిన వాళ్లు చావక తప్పదు. “Everyone born will have to die.” నేను ఆవిడతో మాట్లాడక తప్పలేదు. “I had to talk to her.” నేను స్కూలుకి నడవక తప్పడంలేదు. “I have no alternative but to walk to school.” మీరు మా ఇంటికి రాక తప్పదు. “You must come to our house, please.” In this construction, v. తప్పు will occur only in a negative form or an interrogative form normally implying a negative answer. Also -తీరు can be used in place of తప్పు with the same meaning. |
మారుతున్న | verbal adj. of v. intr. మారు “to change” |
ఎంత కాలం | “how long” |
చెప్పలేం | “We cannot say” |
చూడ్డానికి | “to look at” |
-మాత్రం | “just that” |